- ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ముద్ర, ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థుల కోసం కార్పొరేట్ కంపెనీలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. యాచారం మండలం గున్ గల్ గ్రామ మోడల్ స్కూల్ లో అమెజాన్ సంస్థ సహకారంతో నిర్మించిన నూతన సోలార్ ప్యానల్స్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ ని ఆయన అమెజాన్ డైరెక్టర్ లు బ్రాయిన్ కేనర్, ట్రైలర్, ఓంకార్, సీ యస్ ఆర్ మేనేజర్ తాతజీ, తెలంగాణా మోడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ చారిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకుంటున్న మోడల్ పాఠశాల అభివృద్ధికి అమెజాన్ కంపెనీ ముందుకురావడం పట్ల హర్షం వ్యక్త చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మూళిక సదుపాయాలు కల్పిస్తే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పోటి పడుతారని అన్నారు. గతంలోనే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ పాఠశాలలకు నిధులు కెటాయించారనే విషయాన్ని అయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లావణ్య, ఎమ్మార్వో అయ్యప్ప, ఎంపీడీఓ నరేందర్ రెడ్డి, ఏంఈఓ పాండు, సహకార సంఘం చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీలు శ్రీనివాస్ రెడ్డి, గజ్జి రామకృష్ణ యాదవ్, నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, బిలకంటి చంద్రశేఖర్ రెడ్డి, వరికుప్పల సుధాకర్, మల్లారెడ్డి, మచ్చ లక్ష్మణ్, గిరమోని రవీంధర్, బుచ్చిరెడ్డి, కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
