ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో రామగుండం రైల్వేస్టేషన్, గోదావరిఖని బస్ స్టాండ్, రామగుండం పోలీస్ స్టేషన్, పలుప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.రామగుండం పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి వేళ గోదావరిఖని, రామగుండం ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది,పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏవిధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ప్రయాణికులతో మాట్లాడారు అనంతరం రామగుండం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు.జీడీ బుక్‌ను పరిశీలించారు.ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

