Take a fresh look at your lifestyle.

పారదర్శక మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి:
మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడానికి పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకులు కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల బాధ్యతల విషయంలో బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు జి. లక్ష్మీ బాయి తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మైక్రో అబ్జర్వర్ల బాధ్యతలను వివరిస్తూ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వలను) నియమించడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలంటే మైక్రో అబ్జర్వర్ కీలక బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుందని తెలియజేశారు. పోలింగ్ రోజున ఉదయాన్నే 6 గంటల లోపు కేటాయించిన పోలింగ్ కేంద్రాన్ని చేరుకొని ఏర్పాట్లు ఏవిధంగా ఉన్నాయి, పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎన్నికల నియమ నిబంధనలు పకడ్బందీగా అమలు జరుగుతుందా లేదా అనేది నిశితంగా గమనిస్తూ ఏమైనా పొరపాట్లు గమనిస్తే వెంటనే సాధారణ ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జి. లక్ష్మీ బాయి మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు తమ బాధ్యతల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, శిక్షణ సందర్భంగా ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు . పోలింగ్ రోజున చెక్ లిస్ట్ పెట్టుకొని ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం సజావుగా జరుగుతుందా లేదా అనేది నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సిలుచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకదంగా ఉంటుందని తెలియజేశారు.
మాస్టర్ ట్రైనర్ శ్రీనివాసులు,
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య మైక్రో అబ్జర్వర్లకు పోలింగ్ రోజున వారి బాధ్యతల పై అంశం వారిగా శిక్షణ ఇచ్చారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, శిక్షణ నోడల్ అధికారి రామ మహేశ్వర రావు, డిప్యూటీ ఎల్డియం సాయి, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.