- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు. 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఆయూష్ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. భవ్యంగా యోగా కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని పట్టణ ప్రజలు, అధికారులు, క్రీడాకారులతో కలిసి యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పౌరులు అందరూ ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాలు యోగా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా అధికారులు, విద్యార్థులు, వివిధ విభాగాల ఉద్యోగులు, ప్రజలుపాల్గొన్నారు.
