ముద్ర ప్రతినిధి, భువనగిరి :
నాణ్యమైన వస్తువులు, పరిమాణం, వస్తువుల ధర గురించి తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడుకి ఉంటుందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సురక్షితమైన ఉత్పత్తులు, నమ్మకమైన వినియోగదారులు అనే అంశం పై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. కల్తీ వస్తువులను అధిగమించడానికి చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విద్యావంతులకే కాక సామాన్యులకు కూడా సరైన న్యాయం జరిగినప్పుడే ప్రపంచం వినియోగదారుల దినోత్సవానికి సార్ధకత అని తెలిపారు.నాణ్యమైన వస్తువు సేవలను పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని అన్నారు. ప్రతి శాఖ యొక్క సమాచారతెలుసుకున్నప్పుడుఅ శాఖ పై అవగాహన ఉంటుందని అన్నారు.
సురక్షితమైన ఉత్పత్తులు మాత్రమే అందుబాటులో ఉండేలా కృషి చేయాలని తెలిపారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ అత్యధిక ప్రజలకు చెరువులో ఉండే శాఖ తమదే అని, గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులకు, సంఘ బంధం సభ్యులకు వినియోగదారుల హక్కుల గురించి చెప్పడం జరిగింది. ఫింఛన్లు,ఉపాధిహామీ పధకం క్రింద అర్హులకు వేతనాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఉచిత న్యాయ సేవలు కోసం టోల్ ప్రీ నెంబర్ 15100 సంప్రదించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారి హరికృష్ణ, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ,జిల్లా మెట్రాలిజీ అధికారి వెంకటేశ్వర్లు, వినియోగదారుల ఫోరం సభ్యులు,స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.