Take a fresh look at your lifestyle.

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ 

 

ముద్ర, తుర్కపల్లి :

జిల్లాలో పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా  నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవ తరగతి  పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.

విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి పంపించాలనిచెప్పారు. ప్రశ్నపత్రాలు,జవాబు పత్రాల డిపాజిట్ ను పోలీస్ భద్రతతో  డిపాజిట్ చేయాలని ఆదేశించారు.పరీక్ష కేంద్రాలవద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని,పరీక్ష కేంద్రంలోకి ఇతర వ్యక్తులను వెళ్లకుండా చూడాలని అన్నారు.పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జీరాక్స్ కేంద్రాలు మూసివేసేలా చూసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగరాదని,పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు.

ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.