Take a fresh look at your lifestyle.

“సమస్యల పరిష్కారం కొరకై ధర్నా”

రామకృష్ణాపూర్, ముద్ర : సులబ్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకై జూన్ 5 న కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు తలపెట్టే ధర్నా కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సులబ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం కోరారు.ఆదివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని ఐఎఫ్టియూ కార్యాలయంలో సులబ్ కార్మికులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 200 మంది కార్మికులు ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తుండగా ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు,సౌకర్యాలను కల్పించకపోవడం బాధాకరమన్నారు.రిపేర్లో ఉన్న సులబ్ కాంప్లెక్స్ లను సింగరేణి యాజమాన్యం తక్షణమే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.గజ్జి మల్లేష్,వెంకటేష్,అప్పారావు,నాగరాజు,శ్రీనివాస్,మల్లయ్య,నర్సయ్య,సత్యం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.