Take a fresh look at your lifestyle.

స్వీయ రక్షణకు కరాటే ఎంతో అవసరం: ఎస్సై మాధవరెడ్డి

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : తమకు తాము రక్షించుకునేందుకు చిన్నతనం నుంచే కరాటేలో శిక్షణ పొందితే భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం ఉంటుందని ఎస్ఐ మాధవరెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని నేతాజీ భవనంలో కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు.కరాటే లో శిక్షణ పొందడం వల్ల మంచి క్రమశిక్షణ అలవర్చుకోవచ్చని అన్నారు.పోటీల్లో 30 మంది విద్యార్థులు కలర్ అండ్ బ్రౌన్ బెల్ట్ సాధించగా నలుగురు డి.శివ గణేష్, జి.లోకేష్, జి శ్రీరామ్ చరణ్, పి గురు నాయక్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగిందని కరాటే మాస్టర్ వెంకటేష్ తెలిపారు. ఎగ్జామినర్ గా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ తాజుద్దీన్ వ్యవహరించడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు బెల్ట్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది.కార్యక్రమంలో బ్లాక్ బెల్ట్ నిరూప్ కుమార్, నందు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.