ముద్ర ప్రతినిధి, భువనగిరి: భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 28వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్మల సరిత మల్లేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ జిల్లా నాయకులు, ఆర్ ఎస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఓటర్లను కోరారు. శుక్రవారం 28వ వార్డు ఓటర్లతో మాట్లాడుతూ వార్డు అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుఫై ఓటు వేసి గుమ్మల సరిత మల్లేశం గెలుపుకై కృషి చేయాలని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో గులాబీ నాయకులు పాల్గొన్నారు.