Take a fresh look at your lifestyle.

దామగుండంలో నేవీ రాడార్ పనుల పరిశీలన  – ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని సన్మానించిన నేవి అధికారులు

 

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని దామగుండంలో వేగంగా కొనసాగుతున్న నేవీ రాడార్ స్టేషన్ పనులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, భారత నౌకాదళ ఉపాధ్యక్షుడు వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా

దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం ప్రత్యేక చొరవ తీసుకొని, ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని నీవి వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్  సన్మానించి మొమెంటో అందజేశారు. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధితో పాటు , దేశ భద్రతా పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.