ప్రజల చేతుల్లోనే పార్టీల భవిష్యత్తు కవిత కొత్త పార్టీని స్వాగతిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రస్తుత రోజుల్లో రాజకీయ పార్టీలు పెట్టడం సులభమేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే వాటిని నడపడం ప్రజల మద్దతుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ప్రజలు ఆదరించినప్పుడు మాత్రమే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగిస్తుందని తెలిపారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని చెప్పారు. అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు అని సానుకూలంగా స్పందించారు. కవిత కొత్త పార్టీ పెట్టడాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. కేవలం పార్టీ ప్రకటించినంత మాత్రాన సరిపోదన్న మహేశ్ కుమార్ గౌడ్.. క్షేత్రస్థాయిలో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తేల్చి చెప్పారు, తమ ఓటు బ్యాంక్ చెక్కుచెదరదని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మా ప్రభుత్వంపై.. తీసుకునే విధానాలపై పూర్తి నమ్మకంతో ఉన్నా మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.