Take a fresh look at your lifestyle.

బాధితుల ఇంటి వద్ద నుండి కేసులు నమోదు- జిల్లా ఎస్పీ కే నరసింహ

 

ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాధితుల ఇంటి వద్ద నుండే కేసు నమోదు, ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ బాధితులకు ఇంటివద్దే పోలీసు సేవలు అందించడం జరుగుతుంది అని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. సంఘటనలపై సమాచారం అందుకున్న వెంటనే వేగంగా సంఘటనా స్థలానికి బాధితుల ఇంటికి సంభందిత పోలీసు అధికారులు చేరుకుని పారదర్శకమైన పోలీసు సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గడిచిన వారం రోజులుగా బాధితుల ఇంటి నుండి 111 కేసులు నమోదు చేసి బాధితులకు సేవలు అందించడం జరిగిందని తెలిపారు. మహిళల బాలల వృద్దుల పట్ల ఆకృత్యాలు జరిగినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, దొంగతనాలు జరిగినప్పుడు, వ్యక్తులపై భౌతిక దాడులు జరిగినప్పుడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆకృత్యాలు జరిగినప్పుడు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ జరిగినప్పుడు, బాల్య వివాహాలు జరిగే సమయంలో సమాచారం అందుకున్న వెంటనే బాధితుల ఇంటి వద్ద లేదా వారికి అనుకూలమైన ప్రదేశంలో ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి కేసు పత్రాన్ని బాధితులకు అందజేస్తున్నాము.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమస్యలపై డయల్ 100, ఫోన్ ద్వారా సమాచారం అందించి పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండానే కేసులు నమోదు చేసుకోవాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.