Take a fresh look at your lifestyle.

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

 

ముద్ర కాప్రా

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నర్సింహా పిలుపునిచ్చారు.ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్ లో 12నుండి 17వరకు నిర్వహించిన భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) బహుమతుల ప్రదానోత్సవంలో గెలుపొందిన తపస్యా మరియు నృపతుంగ జట్ల విజేతలకు ఈటీ. నర్సింహా, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సాంస్కృతిక కళామండలి సభ్యులు పల్లె నర్సింహా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర బహుమతులు అందజేశారు.
ఈ సంధర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నర్సింహా మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో అమరుడైన విప్లవకారుడు భగత్ సింగ్ స్ఫూర్తి యువతకు మార్గదర్శకమని అన్నారు. భగత్ సింగ్ వంటి మహనీయుల త్యాగం యువతకు ప్రేరణ. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పోరాట స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు . డ్రగ్స్ వంటి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉండి క్రీడలు, విద్యలో ముందుకు సాగాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల కోసం క్రీడా మైదానాలు, ఆధునిక శిక్షణ కేంద్రాలు, కోచింగ్ సదుపాయాలు మరియు ఆర్థిక సహాయ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని క్రీడల రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషిచేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.