ముద్ర, కోరుట్ల;
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం లో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. తలుపులకు వేసిన తాళం ను పగలగొట్టి మూడు మాసాల బంగారు పుస్తెలు, వెండి ముక్కు పుల్ల, అదే గ్రామంలోని రామాలయంలో హుండీ లు పగులగొట్టి మూడు మాసాల బంగారం పుస్తెలు ఎత్తుకెళ్లారు. అదే క్రమంలో తిమ్మాపూర్ గ్రామంలోని పెద్దమ్మ దేవాలయ హుండీని పగలగొట్టి కొంత నగదు, విగ్రహం యొక్క రెండు మాసాల ముక్కుపుళ్లను ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించడం జరిగింది. వేములకుర్తి గ్రామ దేవాలయ కమిటీ చైర్మన్ కొబాజీ లక్ష్మీనరసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఇబ్రహీంపట్నం ఎస్సై జీ. నవీన్ తెలిపారు.