ముద్ర, కోరుట్ల;
కోరుట్ల సర్కిల్ ఆఫీసర్ గా నూతనంగా వచ్చిన సిఐ కె లక్ష్మీనారాయణ గ్రామాల పర్యటనలో భాగంగా ఆదివారం రోజు ఐలాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ మరియు మాదక ద్రవ్యాల వినియోగం, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు దాని ఆవశ్యకత గురించి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. వారి వద్ద నుండి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని వారితో అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్సై ఎం. చిరంజీవి, గ్రామ సర్పంచ్ దేవనపల్లి రామకృష్ణ, గ్రామ సభ్యులు పాల్గొన్నారు.