Take a fresh look at your lifestyle.

అంగన్వాడీ కేంద్రంలో లో గ్రాడ్యుయేషన్ డే.

ముద్ర,మోత్కూరు:
మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం 1 లో గురువారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ దొంతర బోయిన కల్లమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. అంగన్వాడీ ల్లో చిన్నారులకు పౌష్టికాహారం,ఆటలు,పాటలు ఏ,బీ,సి,డి లు నెంబర్స్ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు,బాలింతలు, చిన్నారుల, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.