- అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం.
తుంగతుర్తి, ముద్ర: గత నాలుగు పర్యాయాలుగా రైతు భరోసా తమకు రావడంలేదని తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గుడిపూడి ఆగారావ్, శంకరమంచి రవీందర్ శర్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు భరోసా రావడం లేదని విషయాన్ని పరిశీలించాలని కోరుతూ వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.అనంతరం మాట్లాడుతూ తుంగతుర్తి శివారులో గల తమ వ్యవసాయ భూములకు గతంలో యధావిధిగా రైతు భరోసా అందిందని గడచిన నాలుగు పర్యాయాలుగా రైతు భరోసా ఆగిపోయిందని తెలిపారు ఇదే విషయంపై స్థానిక తహసీల్ కార్యాలయంలో తమ రైతు భరోసా రావడం లేదని విషయంపై దరఖాస్తు చేసుకోగా తాసిల్దార్ విచారణ జరిపి తమ వద్ద రెవెన్యూ రికార్డులు సక్రమంగానే ఉన్నాయని తెలిపినట్టు వారన్నారు ఇదే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సైతం దరఖాస్తు చేసుకున్న ఫలితం శూన్యంగానే మిగిలిందని తెలిపారు రవీందర్ శర్మ అనే రైతు మాట్లాడుతూ తనకున్నది మూడు ఎకరాల లోపేనని తనకు రైతు భరోసా రావడం లేదని అన్నారు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో సైతం తమకు రైతు భరోసా రావడం లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు కాగా రైతు భరోసా రాకపోగా తమ భూమిలో పండించిన ధాన్యం అమ్ముకోవడానికి సైతం వ్యవసాయ శాఖ కార్యాలయంలో తమ సర్వే నెంబర్లు కనిపించడం లేదని తెలుపుతున్నారని ఇది తమకు అర్థం కావడం లేదని వారు తెలిపారు అధికారులు ఇకనైనా తమకు రైతు భరోసా వచ్చేలా అలాగే పండించిన ధాన్యం అమ్ముకోవడానికి వ్యవసాయ శాఖ లో రిజిస్టర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.