Take a fresh look at your lifestyle.

నేడే ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి

 

. హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభయాత్ర

ముద్ర, తాండూర్: మొగలు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన హిందూ హృదయ సామ్రాట్, మరాఠీ యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని హిందూ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని కాళికాదేవి దేవాలయం నుండి మధ్యాహ్నం 3గంటలకు ర్యాలీ ప్రారంభమై వినాయక చౌక్, ఇందిరా చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని, కావున తాండూర్ పరిసర ప్రాంతాల నుండి, ప్రతి గ్రామం నుండి హిందూ బంధువులు అధిక మొత్తంలో హాజరై శివాజీ మహారాజ్ శోభయాత్రను విజయవంతం చేయాలని బజరంగ్ దళ్, హిందూ వాహిని, విశ్వహిందూ పరిషత్, హిందూ కేంద్ర సమితి, హిందూ అనుబంధ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.