ముద్ర ప్రతినిధి, మెదక్
ప్రత్యేక తరగతుల ద్వారా ఉత్తమ విద్యా ప్రమాణాలు పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు వస్తాయని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
బుధవారం కౌడిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించి అనంతరం విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనం, మెనూ
ఆహార పదార్థాలను పరిశీలించారు తరగతి గదులలో పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సబ్జెక్టుల వారీగా ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయంలో నిబంధనలు పాటించాలని రుచి సూచితో కూడిన ఆహార పదార్థాలు విద్యార్థులకు అందించాలన్నారు.
ఈ సంవత్సరం పదవ తరగతి జిల్లాలో ఉత్తమ ఫలితాలు లక్ష్యంగా
ముందుకు పోతున్నామని ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టుల వారీగా సామర్థ్యాలను పెంపొందించి
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య లక్ష్యంగా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులు చదువుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.