ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : వైశాఖ శుద్ధ దశమి రోజున బుధవారం వాసవి మాత జన్మదినోత్సవ వేడుకలు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు, పూజలు , గీతా, వాసవి మాత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణము, అమ్మవారి పల్లకి సేవ, మహిళలచే సామూహిక కుంకుమార్చన, అమ్మవారి డోలరహణం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలలు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు అనంతరం మంగళహారతి, తీర్థ ప్రసాదాలు బోజన ప్రసాదాలు వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ , మండల సంఘం నాయకులు అనుబంధ సంఘాలు వాసవి క్లబ్,ఆవోప, మహిళా సంఘం నాయకులు, నాయకురాలు,మహిళలలు తదితరులు పాల్గొన్నారు.