ముద్ర, వనపర్తి:
వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్ చైర్మన్ గా మిడిదొడ్డి మాధవి , వైస్ చైర్మన్గా మధుసూదన్ గౌడ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఉదయం 11 గంటలకే సమావేశమైన కౌన్సిల్ ఎన్నికల అధికారి ఆర్డీవో సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్ ఎన్నిక వెంటనే వైస్ చైర్మన్ వెనుక జరిగాయి. మున్సిపల్ చైర్మన్ గా మిడిదొడ్డి మాధవిని కౌన్సిలర్ పరశురాం ప్రతిపాదించగా వైస్ చైర్మన్గా మధుసూదన్ గౌడ్ ను కౌన్సిలర్ బి వెంకటేష్ ప్రతిపాదించారు. ఈ పదవులకు ఎవరు పోటీ పడకపోవడంతో వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు.
