Take a fresh look at your lifestyle.

బిన్ తిమ్మాపురం గ్రామ ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేని కలిసిన సర్పంచ్

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి :
భువనగిరి మండలంలోని బి ఎన్ తిమ్మాపురం గ్రామ ప్రజా సమస్యలు భూ నిర్వాసితుల సమస్యలు ఆర్ అండ్ ఆర్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని భవనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి గ్రామ సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బి ఎన్ తిమ్మాపురం గ్రామ భూ నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రజా సమస్యలు ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే భూ నిర్వాసితులకు సంబంధించిన బడ్జెట్ అందజేస్తామని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఆర్ఎన్ఆర్ కాలనీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా పనులు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల పోరం అధ్యక్షులు పాశం శివానంద్, సర్పంచులు గ్రామస్తులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.