రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ బోనాల జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి,మందమర్రి ఎస్సై రాజశేఖర్,ఆర్కేపీ ఎస్సై రాజశేఖర్,క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.అనంతరం వారు మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు.ఆలయ ప్రధాన అర్చకులు రమణాచారి, లవకుమార్, కమిటీ సభ్యులు సమ్మయ్య, సత్యనారాయణ, తిరుపతి, సుధాకర్, కనకయ్య, రాజయ్య, కుమార్, ఓదెలు, మొండి, కుమార్ గౌడ్, శంకర్ పాల్గొన్నారు.
