Take a fresh look at your lifestyle.

జుంటుపల్లి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

 

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా యలాల్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం జుంటుపల్లి రామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామచంద్రుడు యుగయుగాలకు తరగని వ్యక్తిత్వమని, పరిపాలనకు ఆదర్శమని, శ్రీరామచంద్రుల కృప వల్ల తాండూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన వేడుకున్నారు. అనంతరం పట్టణంలోని అనేక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఇందిరా నగర్ లోని రామ్ మందిర్, పాత తాండూర్, సీతారాంపేట్, సీసీఐ కాలనీ, సాయి పూర్, మల్రెడ్డిపల్లి తదితర దేవాలయాల్లోని సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.