- స్పందించి.. పనులు చేయించి.
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక ఆరో వార్డు పరిధిలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ముందు వర్షపు నీరు చేరి విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని ముద్ర వెబ్ లింక్లో ప్రచురించిన కథనానికి క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు స్పందించారు. తక్షణమే మున్సిపల్ సిబ్బందితో స్కూల్ ముందు చేరిన వర్షపు నీటిలో బుధవారం కంకర,డస్ట్ వేయించారు. సమస్యను పరిష్కరించినందుకు స్కూల్ ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆరో వార్డులోని ప్రధాన కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి నీరు ప్రవహించే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు.