Take a fresh look at your lifestyle.

రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో పాల్గొన్న కార్పొరేటర్

మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి డివిజన్ లోని మస్జీద్ బండ మెయిన్ రోడ్డులో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు డిఈ ఆనంద్, ఏఈ భాస్కర్ లతో కలిసి ‘రోడ్ సేఫ్టీ డ్రైవ్’ లో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగేందర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత డ్రైవ్ ద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని, సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించవచ్చని అన్నారు. రోడ్ సేఫ్టీ డ్రైవ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, తద్వారా సురక్షితమైన రోడ్లను నిర్మించవచ్చని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.