35 కు 27 వార్డులు హస్తం కైవసం – కారు పార్టీకి 3 , స్వతంత్రులకు 5 స్థానాలు
ముద్ర ప్రతినిధి ……. కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 35 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 3 వార్డులు ముందే ఏకగ్రీవం కాగా మిగిలిన 32 వార్డులకు ఎన్నిక జరుగగా 24 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుని మొత్తం 27 వార్డులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది . బీఆర్‌ఎస్ పార్టీ కేవలం 3 వార్డుల్లో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 5 వార్డుల్లో గెలిచి తమ సత్తా చాటుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు అనేక వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగి చివరకు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. పట్టణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రచారంలో ప్రధానంగా తీసుకెళ్లిన కాంగ్రెస్‌కు ఓటర్లు స్పష్టమైన మద్దతు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేకపోవడం ఆశ్చర్యం. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు 5 వార్డుల్లో విజయం సాధించడం గమనార్హం. ఈ ఎన్నికల ఫలితాలతో మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడంతో కాంగ్రెస్ లో ఇప్పుడు చైర్ పర్సన్ అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది .