* ఓల్డ్ లైబ్రరి తీసేయడం దారుణం
* జూవైనల్ కోర్టుకు మరో బిల్డింగ్ ఏర్పాటు చేసుకోండి… నిరుద్యోగ యువత
ముద్ర ప్రతినిధి,సిద్దిపేట :
సిద్దిపేట పట్టణ కేంద్రం లో ఉన్న ఓల్డ్ లైబ్రరీ తరలించడం దారుణం అని.. ఆ లైబ్రరీ తమకు కావాల్సిందే అని నిరుద్యోగ యువతి యువకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఓల్డ్ లైబ్రరి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న లైబ్రరీ అక్కడినుండి తీసేయడం వల్ల చాలా మంది నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఉద్యోగాలకొరకు,ఆర్థికంగా వెనుకబడిన జాబ్ ఆస్పిరెంట్స్ నూతన లైబ్రరీకి వెళ్లాలంటే వ్యయ ప్రసాయాలను భరించాల్సి వస్తుందన్నారు. తమతో పాటు సీనియర్ సిటిజెన్స్ కూడా ఓల్డ్ లైబ్రరిలో ఎన్నో ఏండ్లుగా పాఠకులుగా ఉన్నారన్నారు. లైబ్రరీ పట్టణ కేంద్రం లో ఉండడం వల్ల అందరికి అనుకులాంగా ఉండేదని కాని అక్కడ జూవైనల్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల తమ లాంటి పేద విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జిల్లా ఉన్నతధికారులు, జ్యూడిషియల్ అధికారులు నిరుద్యోగులపై కరుణించి ఓల్డ్ లైబ్రరీ ను అలాగే కొనసాగించి. జూవైనల్ కోర్టుకు మరో బిల్డింగ్ లో ఏర్పాటు చేసుకోవాలని కోరారు…..