Take a fresh look at your lifestyle.

సీఎం కప్ కబడ్డీ విజేత జేతురం తండా

ముద్ర, తుర్కపల్లి:
తుర్కపల్లి మండలంలో నిర్వహించిన సీఎం కప్ టోర్నమెంట్‌లో కబడ్డీ విభాగంలో జేతురం తండా గ్రామ యువకులు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. ద్వితీయ బహుమతి మోడల్ స్కూల్ విద్యార్థులకు దక్కింది. ఈ సందర్భంగా జేతురం తండా సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ, గ్రామానికి ఈ విజయం గర్వకారణమని, యువకులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సక్కు మోహన్ నాయక్, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.