Take a fresh look at your lifestyle.

ఠాగూర్ స్టేడియంలో ఫుట్ బాల్ పోటీలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఈ నెల 9 నుంచి 12 వ తేదీ వరకు స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాలికల స్టేట్ లెవెల్ ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 27 మ్యాచ్ లు జరుగుతాయని చెప్పారు. ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే జట్ల నుంచి 22 మంది క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర స్థాయి జట్టుగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.