Take a fresh look at your lifestyle.

కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు తక్షణమే స్థలాన్ని కేటాయించాలని… బిజెపి నాయకురాలు బోగ శ్రావణి డిమాండ్…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జగిత్యాలలో కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు తక్షణమే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని బిజెపి నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రం మంజూరు చేసిన నవోదయ విద్యాలయం కోరుట్లలో పూర్తయినప్పటికీ, జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ (వాలంతరి) వద్ద కేంద్రియ విద్యాలయానికి స్థలం కేటాయించడంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో జిల్లా మంత్రి వెంటనే స్పందించి, తన చిత్తశుద్ధిని చాటుకోవాలని, లేనిపక్షంలో అది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమేనని ఆమె పేర్కొన్నారు. మే 15 లోపు స్థలం కేటాయించకపోతే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిరాహార దీక్ష చేస్తారని హెచ్చరించారు. అలాగే కేంద్రియ విద్యాలయం రావడం కేవలం చదువు కోసమే కాకుండా, ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఎంతో అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కొక్కు గంగాధర్, శ్రీనివాస్, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.