Take a fresh look at your lifestyle.

అంబరాన్నంటిన జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు

  • పూర్వ విద్యార్థుల, అపూర్వ కలయిక.

మధిర, ముద్ర విలేఖరి : మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు అంబరాన్నంటాయి. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికతో కళాశాల ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించిన 1970 వ సంవత్సరం బ్యాచ్ నుండి నేటి వరకు చదువుకున్న 55 సంవత్సరాల విద్యార్థులతో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో చదివిన వేలాదిమంది విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని తమ గత జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఎక్కడెక్కడ స్థిరపడి ఏమి చేస్తున్నారో తెలుసుకొని ఆనందోత్సవాలతో గడిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా దేశంలోని పలు ప్రాంతాలలో స్థిరపడిన వారు సైతం ఈ వేడుకలలో పాల్గొన్నారు.పూర్వ విద్యార్థులు తమకు విద్యాబోధన చేసిన అధ్యాపకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కళాశాలలో చదివి పలు ఉన్నత స్థానాలకు చేరుకున్న పూర్వ విద్యార్థులను కూడా ఘనంగా సన్మానించారు. బ్యాచుల వారీగా విద్యార్థులు తమ కళాశాల తరగతి గదులలో ఫోటోలు దిగి తమ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 55 సంవత్సరాల నుండి చదువుకున్న పూర్వ విద్యార్థులు వేలాదిమంది గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరైనప్పటికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేశారు. 75 మంది పూర్వ విద్యార్థులు 5 కమిటీలు వేసుకొని దాదాపు రెండు నెలలుగా సమావేశాలు జరిపి గోల్డెన్ జూబ్లీ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించి వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు బ్యాచుల బ్యాచ్ల వారీగా ఆడి, పాడి ఆనందోత్సాహాలతో గడిపారు . అదేవిధంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కళలు ఆకట్టుకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.