Take a fresh look at your lifestyle.

కొండగట్టులో యువకుడి దారుణ హత్య

  • విచారణ అనంతరం పూర్తి వివరాలు.

మల్యాల, ముద్ర విలేఖరి: కొండగట్టులో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన కలకలం సృష్టించింది.మండలంలోని కొండగట్టు దిగువ ప్రాంతంలో మెట్ల దారి వద్ద కొండగట్టుకు చెందిన రమణారెడ్డిని దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహం కొండగట్టు మెట్ల దారి పక్కన గోతిలో పూడ్చిపెట్టినట్లు ఆధారాలు ఉండడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. తాసిల్దార్ సమక్షంలో అక్కడే పంచనామ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. మృతుడిని కొట్టి చంపినట్లుగా మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ నీలం రవి తెలిపారు.ఈ కేసులో ప్రాథమికంగా ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లు సమాచారం హత్యలో నిందితులపై విచారణ చేపట్టి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.