అవినీతి అధికారుల ఆటకట్టించిన కౌన్సిలర్. -ఏసీబీ వలలో వికారాబాద్ మహిళ పోలీస్ సీఐ, ఎస్ ఐ – రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసీబీ ఆదికారులు
ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
కుటుంబ కలహాల కేసులో బెయిల్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన పోలీసుల ఉదంతాన్ని తాండూరు కౌన్సిలర్ ఇర్షాద్ బట్టబయలు చేశారు. తనపై నమోదైన సెక్షన్ 498A కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వికారాబాద్ ఉమెన్ పోలీస్ స్టేషన్

సిఐ సరోజ , ఎస్ఐ రాణి ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున మొత్తం ₹60,000 డిమాండ్ చేశారని ఈర్షద్ తెలిపారు. అవినీతికి తలొగ్గడం ఇష్టం లేని ఇర్షాద్, అవినీతి నిరోధక శాఖ అధికారులకు ముందస్తు సమాచారం అందించారు. దీంతో లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులకు పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇప్పటివరకు ఐదుగురు అవినీతి అధికారులను చట్టానికి పట్టించాను, ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు రావాలి అని ఈర్షద్ ఈ సందర్భంగా తెలిపారు. ఏసీబీ డి.ఎస్.పి రంగారెడ్డి రేంజ్ ఆనంద్ కుమార్ వికారాబాద్ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు.
