ముద్ర కాప్రా
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో కొనసాగుతున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియతో పాటు త్వరలో ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ మను చౌదరిని ఆయన కార్యాలయంలో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, ప్రస్తుతం జరుగుతున్న తీరుతెన్నులు, ప్రజలకు కలిగే ఇబ్బందులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ,బీజేపీ నాయకులు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, బుద్ధి శ్రీనివాస్, ఎం. కాంతారావు, గొరిగి కృష్ణ, తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.