- మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.
మల్యాల,ముద్ర విలేకరి: కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని ముత్యంపేట రెడ్డి ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అవకాశం రాలేదని ఎవ్వరూ బాధపడొద్దని, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నందున అవకాశాలు కచ్చితంగా వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ శ్రేణులను బలపర్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలువాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జనగం శ్రీనివాస్, బోయిన్పల్లి మధుసూదన్, ఆయిల్నేని సాగర్ రావు, బద్దం తిరుపతిరెడ్డి, ఎడిపెల్లి అశోక్, కొండబత్తిని త్రినాథ్, తైదల శ్రీలత, బాలే సంజీవ్, అజార్, బద్ధం రామచంద్రారెడ్డి, కాటిపల్లి స్వామిమిరెడ్డి, సంత మోహన్ రెడ్డి, బుర్ర అంజయ్య తదితరులు పాల్గొన్నారు.