Take a fresh look at your lifestyle.

శిక్షణ కోసం సిరిసిల్లకు వెళ్తున్న బస్సు ను ప్రారంభించిన జిఎం

  • నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి.
  • జిఎం లలిత్ కుమార్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి సంస్థ ఆధ్యర్యంలో నిరుద్యోగ యువతీ,యువకులకు ఉపాది కల్పనలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులను సోమవారం సిరిసిల్ల పంపించే బస్సు ను ఆర్ జి వన్ జిఎం లలిత్ కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఆర్జీ.1 ఏరియా జివిటిసి లో జియంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, హైదరాబాద్ ద్వారా “ఎలక్ట్రానిక్ హౌస్ వైరింగ్” (బాలురకు) “హోం హెల్త్ ఎయిడ్”(మహిళలకు)రెండు నెలల ఉచిత శిక్షణ-స్వయం ఉపాధి కొరకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంపికయిన 30 మంది గోదావరిఖని పరిసర ఇతర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులను శిక్షణ కొరకు సిరిసిల్ల పంపించడా నికి కార్యక్రమం నిర్వహించారు.ఆర్జీ.1 ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్ పచ్చ జెండా ఊపి బస్సును సిరిసిల్ల కు పంపించారు.ఈ సందర్భంగాజిఎం డి. లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్యర్యంలో నిరుద్యోగ యువతీ,యువకులకు ఉపాది కల్పనలో గోదావరిఖని, పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు చదువుకొని సరైన ఉపాధి లేక ఎక్కువ శాతం నిరుద్యోగులుగా మిగిలిపోతున్న రని వీరికి సింగరేణి సంస్థ ఆర్జీ.1 ఆద్వర్యంలో జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ద్వారా సిరిసిల్ల లో “ఎలక్ట్రానిక్ హౌస్ వైరింగ్” బాలురకు,“హోం హెల్త్ ఎయిడ్” మహిళలకు ఉచిత శిక్షణ,ఉపాధి అవకాశాలు కల్పించుటకు పంపించడం జరిగిందన్నారు. వీరికి శిక్షణతో పాటు బోజనము, హాస్టల్ సదుఫాయం కల్పించడం గొప్ప కార్యక్రమం అని అభ్యర్థులు ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.వీరికి భవిష్యత్తులో ఎక్కడైన స్వయం ఉపాధి పొందుటకు అవకాశం ఉంటుందన్నారు.ఈ శిక్షణ వారి కుటుంబంలో గొప్ప మార్పు తీసుకువస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్జీ1 యస్.ఓ.టు జియం ఆంజనేయ ప్రసాద్, జివీటిసి మేనేజర్ డినేల్ కుమార్, అసిస్టెంట్ అధికారి మధుకర్ రెడ్డి, వేణుగోపాల్, బి.కృష్ణ మురళి, శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.