ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ లో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న జి విజయభాస్కర్ పై నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు చేశారు. పది రోజుల క్రితం నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం అభియోగాలపై సస్పెండ్ చేశారు. అయితే పాఠశాల విదార్థినుల తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టారు. ఆరోపణలు ఋజువు కావటంతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.