ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి
జిల్లాలో రైతుల ఆదాయం పెంపు,వ్యవసాయ ఉత్పాదకతలో గణనీయమైన వృద్ధి సాధించేందుకు ఫార్మ్ మెకనైజేషన్,వర్షాధార ప్రాంతాల అభివృద్ధి అర్ఏడి,తేనెటీగల పెంపకం పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ,ఉద్యానవన, డీఆర్‌డీఏ శాఖల అధికారులతో జిల్లాలో అమలవుతున్న ఫార్మ్ మేకనైజేషన్,వర్షాదార ప్రాంతాల అభివృద్ధి,తేనెటీగల పెంపకం కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన ఫార్మ్ మెకనైజేషన్ లక్ష్యాలను వేగంగా సాధించాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు సాధించిన పురోగతిని పరిశీలించి, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు యూసి వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలని, రైతులను యాంత్రీకరణ వైపు మరింతగా ప్రోత్సహించాలని సూచించారు.ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా మినీ ట్రాక్టర్లు,పవర్ వీడర్స్, పవర్ టిల్లర్స్, బ్రష్ కట్టర్స్, పవర్ స్ప్రేయర్స్ వంటి యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 97 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు.వర్షాధార ప్రాంతాల అభివృద్ధి అర్ ఏ డి పథకం ద్వారా రైతుల ఆదాయం పెంపు,ఆహార భద్రత, వ్యవసాయ ఉత్పాదకత మెరుగుదల లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నామని ,
ఈపథకాల అమలులో వ్యవసాయ,ఉద్యానవన, డీఆర్‌డీఏ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.తేనెటీగల పెంపకం బీ కీపింగ్ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని,ఎక్కువ మంది రైతులకు బీహైవ్ యూనిట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా,కమర్షియల్ స్థాయిలో తేనెటీగల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రోత్సహించాలని డీఆర్‌డీఏ అధికారులకు సూచించారు.
ఈసమీక్ష సమావేశంలో డిఆర్డిఏ ఏపీడి సూర్యరావు, ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు,జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి,తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post