Take a fresh look at your lifestyle.

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

ముద్ర, శేరిలింగంపల్లి:
భారతరాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ డాక్టర్ ఎం.రమేష్, అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ మరియు ఇతర ఉన్నతాధికారులు మరియు పోలీసు సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన అసమాన సేవలను మరియు రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీ డాక్టర్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీ సంజీవ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ షమీర్, సి ఎస్ డబ్ల్యూ ఏడీసీపీ హనుమంతురావు, ఆర్ఐ లు రామారావు, వీరలింగం, అనిల్, నాగరాజు రెడ్డి, నాగరాజు, వీరారెడ్డి, బి.డి టీమ్ సభ్యులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సి.ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది మరియు కమీషనరేట్ కార్యాలయ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.