Take a fresh look at your lifestyle.

పోషకాహారం తీసుకుంటే మనిషి సంపూర్ణ ఆరోగ్యం-ఐసిడిఎస్ కోరుట్ల సూపర్ వైజర్ అలువాల భారతి….

 

కోరుట్ల, ముద్ర;
సంపూర్ణ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారo తీసుకుంటేనే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ కోరుట్ల సూపర్ వైజర్ అలువాల భారతి అన్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణ సాయిరాంనగర్ 1వ అంగన్ వాడి కేంద్రంలో పోషక పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అలువాల భారతి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గర్భిణీ స్త్రీలు బాలింతలు 0-6 ఏళ్ల పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారంపై పరిపూర్ణ అవగాహన కల్పించారు.

జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 3 – 6 ఏళ్ల పిల్లలను అంగన్ వాడి కేంద్రానికి పంపించాలని పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటల తో పాటు విద్యను అందించడం జరుగుతుందని భారతి తెలిపారు. అనంతరం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, అంగన్ వాడి టీచర్లు టీ. శోభారాణి, సిహెచ్. మాధవి, బి. శంకరమ్మ ఆయా విజయ, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.