ప్రతి పేదవాడి స్వంత ఇంటి కల ఇందిరమ్మ ఇళ్లు- కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు….
కోరుట్ల, ముద్ర;
ప్రతి పేదవాడి స్వంత ఇంటి కల ఇందిరమ్మ ఇళ్లు అని కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు. కోరుట్ల పట్టణంలోని 17 వార్డు గంగంపేట్ లో మండ జ్యోతి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి యజమాని మండ జ్యోతి కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సర కాలంలో తెరాస పాలనలో తెరాస నాయకులు అవినీతికి పాల్పడి పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నరే తప్ప పేదప్రజల అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి ఆలోచన విధానంతో ప్రతి పేదవాడి స్వంత ఇంటి కల నెరవేర్చి రాష్ట్రం లో ప్రతి మహిళకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా స్వంత ఇంటి కల నెరవేరిందని, మా కుటుంబం మొత్తం జువ్వాడి నర్సింగరావు,17 వార్డు కౌన్సిలర్ సోగ్రబి, అక్బర్ కు ఇందిరమ్మ ఇంటి యజమాని మండ జ్యోతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్ షాహిద్, విజయ్, సమిద్, తబ్రేజ్, రమేష్, రాములు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.