Take a fresh look at your lifestyle.

30న టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు జిల్లా అధ్యక్షులు యాదగిరి

ముద్ర ప్రతినిధి, మెదక్:
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 30న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర విద్యా సదస్సుకు జిల్లాలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో కదిలి విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదగిరి కాంగోటి, ప్రధాన కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యా సదస్సు గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. విద్య అందరికీ సమానంగా అందకుండా విధానాలు రూపొందిస్తున్నారని అవేదనవ్యక్తంచేశారు. విద్యారంగానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నిధులను కేటాయించడం లేదని, వందలాది ప్రభుత్వ పాఠశాల మూసివేతకు రంగం సిద్ధం చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంగయ్య, హీరా లాల్, రాజేంద్ర ప్రసాద్, నజీరుద్దీన్, అల్వాల రమేష్, సంగీత, శశిధర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సాయిబాబా, నసీరుద్దీన్, మంగ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.