Take a fresh look at your lifestyle.

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • టాస్క్ సిఓఓ , ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలో ఐక్యత ఫౌండేషన్ , శంకర నేత్రాలయ చెన్నై ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రెడ్డి తెలిపారు. కల్వకుర్తి పట్టణం లోని సి కె ఆర్ ఫంక్షన్ హాల్లో 05వ తేదీ నుండి 13వ తేదీ ఆదివారం వరకు.ప్రతి రోజు ఉదయం 09:00 గం.ల నుండి మధ్యాహ్నం 01:00 గం.ల కంటి పరీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. ఉచిత కంటి పరీక్షలతో పాటు, కంటి శుక్లాలకు ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.