Take a fresh look at your lifestyle.

కూకట్‌పల్లిలో ఓ వ్యక్తికి కోవిడ్ -19 పాజిటివ్

  • ధృవీకరించిన వైద్యాధికారులు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కూకట్ పల్లి వివేకానంద నగర్‌లో ఓ వ్యక్తికి కోవిడ్ – 19 పాజిటివ్ ఉన్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ సి. ఉమాగౌరి ధృవీకరించారు.కోవిడ్ సోకిన వ్యక్తి ఐదు రోజుల పాటు కోవిడ్ ఐసోలేషన్ నిబంధనలను పాటించారని, ఆయన కుటుంబ సభ్యులలో ఎవరికీ లక్షణాలు కనిపించలేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పూర్తిగా కోలుకున్నారని, నియంత్రణ చర్యలు పాటించాలని సూచించినట్లు ఆమె వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఎవరికైనా జ్వరం లేదా కోవిద్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆరోగ్యశాఖకు తెలియజేయాలని ఆమె సూచించారు.ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. కోవిద్ అనుమాన లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పీహెచ్ సీలు, యూపీహెచ్ సీలు, బస్తీ దవాఖానాలు, పల్లె దావాఖానాలలో సంప్రదించాలని ఆమె కోరారు.

Leave A Reply

Your email address will not be published.