Take a fresh look at your lifestyle.

ఎనిమిది కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన పీయేసీ ఛైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి:   పీయేసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని దోవా కాలనీ, శ్రీల గార్డెన్, న్యూ కాలనీ, శ్రీలక్ష్మీ నగర్, ఎఫ్.సి.ఐ కాలనీ, టి.ఎన్.నగర్, ఎం.ఎ నగర్, ప్రశాంత్ నగర్, నాగార్జున ఎనక్లేవ్, బీకే ఎన్ క్లేవ్, రెడ్డి కాలనీ, మక్త మహబూబ్ పెట్ విలేజ్, కృష్ణ సాయి, జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలలో రూ.4 కోట్ల 70 లక్షల 35 వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. చందానగర్ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీ, సత్య ఎనక్లేవ్, శంకర్ నగర్, కాలనీలలో రూ.84 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ ఫేస్-2, పీజేఆర్ నగర్ కాలనీలలో రూ.57 లక్షల 25 వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రై హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్.ఎం.టి. శాతవాహన నగర్, అడ్డగుట్ట కాలనీల లో రూ. 62 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, మరియు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో అధికారులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.