Take a fresh look at your lifestyle.

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

ముద్ర, వనపర్తి :
పొలం తగాదాల్లో చోటు చేసుకున్న గొడవ కారణంగా తీవ్రంగా గాయపడి వనపర్తి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖిల్లా ఘణపురం మండలం మల్కుమియన్ పల్లి గ్రామానికి చెందిన బాధితులను శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పరామర్శించారు.


వెంకటం పల్లి, మల్కుమియన్ పల్లె గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో చోటు చేసుకున్న పొలం తగాదా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు దారి తీసింది.
ఈ క్రమంలో వెంకటాంపల్లికి గ్రామానికి చెందిన పలువురు రైతులు మల్కుమియన్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, మేఘారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సత్తిరెడ్డి, ఎల్లారెడ్డిల పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
గాయపడిన వారు వనపర్తి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే పరామర్శించారు.
కార్యక్రమంలో వసురం తండా నాయకులు రవి నాయక్, గోపాల్ రెడ్డి, మన్యపు రెడ్డి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.