Take a fresh look at your lifestyle.

హోళీ… రంగుల కేళీ వేడుకల్లో అదనపు కలెక్టర్, ఎస్పీ, మాజీ కలెక్టర్, చైర్ పర్సన్, యువకులు

ముద్ర ప్రతినిధి, మెదక్:
హోళీ పండుగను మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆనందంగా జరుపుకున్నారు. అధికారికంగా హోలీ పండుగ సెలవు కావడంతో జిల్లా కేంద్రం మెదక్ అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, యువకులు, మహిళలు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. యువకులు బైకులపై తిరుగుతూ మిత్రులకు రంగులు పూయడం కనిపించింది.
క్యాంపు కార్యాలయంలో

కలెక్టరేట్, అందనపు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హోళీ సంబరాలు అంబరాన్నంటాయి. రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ (మాజీ కలెక్టర్) రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, అధికారులు సిబ్బందితో కలిసి రంగులు పూసుకున్నారు. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పీడీలు, పీఈటిలు రంగులు చల్లారు.
ఎస్పీ క్యాంపు కార్యాలయంలో


మెదక్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ పండుగను జరిపారు. ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకలు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పరస్పరం రంగులు చల్లుకొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. అదనపు ఎస్పీ మహేందర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐ శైలందర్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
చైర్ పర్సన్ రాధిక ఆధ్వర్యంలో


మెదక్ మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్.. మెప్మా మహిళలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఛైర్ పర్సన్ అయిన తర్వాత మొదటిసారిగా హోలీ సంబరాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులమయంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. 28వ వార్డు కౌన్సిలర్ అఖిల భరత్ తదితరులు పాల్గొన్నారు. 6వ వార్డులో కౌన్సిలర్ హరిత నర్సింగ్ రావు ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరిపారు. యువకులు, మహిళలు,, చిన్నారులు ఒకరినొకరు రంగులు పూసుకుంటూ సందడి చేశారు. వీధుల్లో చిన్న పిల్లలు సైతం రంగులు చల్లుతూ హంగామా చేశారు.

Leave A Reply

Your email address will not be published.