Take a fresh look at your lifestyle.

మంచినీరు,డ్రైనేజీ సమస్యలు తెలెత్తకుండా చర్యలు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి డివిజన్ లోని కాలనీల్లో, బస్తీలలో డ్రైనేజీ సమస్యలపై జలమండలి అధికారులు వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ కృష్ణ వారి బృందంతో కలిసి ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగేందర్ మాట్లాడుతూ పొంగుతున్న డ్రైనేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. అధికారులు, వివిధ శాఖలతో అధికారులతో కలిసి ఒకరికోకరు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. పాపిరెడ్డి నగర్, హెచ్ఏఎల్ కాలనీ మరియు పలు బస్తీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అందుకు జిఎం కృష్ణ స్పందిస్తూ కార్పొరేటర్ ఆదేశాల మేరకు డివిజన్ లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిజిఎం నరేందర్ రెడ్డి, మేనేజర్ అభిషేక్ రెడ్డి, మేనేజర్ సందీప్ రెడ్డి, పాపిరెడ్డి నగర అధ్యక్షులు కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ రాంబాబు, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, హెచ్ఏఎల్ కాలనీ ప్రెసిడెంట్ పరశురామ్, కొండల్ రెడ్డి, కుమార్, సిద్దయ్య, శ్రీనివాస్ రెడ్డి, శంకర్, నరేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.