Take a fresh look at your lifestyle.

ఆదర్శ ప్రాయం భారత రాజ్యాంగం: డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తుందని డి సి సి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు లక్ష్మణచాంద మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, చాచా నెహ్రూ, ఛత్రపతి శివాజీ, చాకలి ఐలమ్మ, తెలంగాణ తల్లి ,అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామంలో జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ రక్షణ పాదయాత్ర నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగమని అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన అందరి హక్కు, బాధ్యత అని పేర్కొన్నారు. 145 సంవత్సరం ముందు భారత దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్నపుడు భారత దేశం స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని అన్నారు. గాంధీ పోరాటఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గాంధీని చంపిన గాడ్సే ని పూజిస్తున్నారని, ఇది చాలా బాధాకరం అని అన్నారు.ప్రపంచం లో ఉన్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని అన్నారు. కులం,మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసన తెలపాలని అన్నారు.గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మండలం లో ఒక్క బోరిగాం లో మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని అన్నారు.రాష్ట్రాన్ని నాశనం చేశారని, అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిందని తెలిపారు.రూ.500కే సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ ప్రారంభించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా వడ్యాల్ తండాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణం ప్రారంభించామని తెలిపారు.రైతు ఋణం రూ.2 లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేశామని అన్నారు. రానున్న రోజుల్లో వచ్చే ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.అనంతరం మండల పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావును ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఓడ్నాల రాజేశ్వర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వ్యవసాయ కమిటీ ఉపాధ్యక్షులు ఈటల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షులు దుర్గా భవాని, మాజీ జడ్పిటిసి ఓస రాజేశ్వర్, మాజీ ఎంపీపీ నరేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ బిట్లింగ్ నారాయణ, నిర్మల్ పట్టణ అధ్యక్షులు చిన్ను, మాజీ సర్పంచులు ప్రతాప్ రెడ్డి, భీమన్న, గంగాధర్, నారాయణ, సురేష్, మేకల రాజేందర్, ఎస్సీ సెల్ నాయకులు లింగన్న, గుర్రం లింగారెడ్డి, రజినీకాంత్, పడిగెల మహిపాల్, బర్కం రమేష్ ,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.